Header Banner

అనంతపురంలో పెట్రోల్ బంక్ లో భారీ మోసం.. లక్షల లీటర్ల దోపిడీ! విజిలెన్స్ తనిఖీల్లో షాకింగ్ నిజాలు!

  Thu Feb 20, 2025 22:33        Others

పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూసాం… కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ మోసం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అంటున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పెట్రోల్ బంకులు కొత్త రకం మోసం బయటపడింది. ఎలక్ట్రికల్ చిప్ అమర్చి రీడింగ్ ను టాంపర్ చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యాలు… వాహనదారులను నిలువున మోసం చేస్తున్నాయి. ఆఖరికి లీగల్ మెట్రాలాజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ ల గుట్టును విజిలెన్స్ అధికారులు బట్ట బయలు చేశారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనంతపురం శివారు ప్రాంతమైన సోమలదొడ్డిలోని శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!


పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒక్క సంవత్సరంలో రెండు లక్షల పై చిలుకు లీటర్ల డీజిల్ ని మిగుల్చుకున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం… వాహనదారుల నుంచి దాదాపు రెండు కోట్ల పైచిలుకు డబ్బు అక్రమంగా సంపాదించినట్లు తెలుసుకున్న విజిలెన్స్ అధికారులే కంగుతున్నారు. దీంతో విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో చిప్ బాగోతం బయటపడింది. ఒక సంవత్సరంలోనే సుమారు ఒక పంపు ద్వారా రెండు కోట్ల పైచిలుకు రూపాయిలు మోసం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #petrolbunk #scam #todaynews #flashnews #latestupdate